Pushpa 2: రెండు రోజుల క్రితం “పుష్ప 2″కి సంబంధించి చిన్నపాటి వీడియో రిలీజ్ కావటం తెలిసిందే. ఆ వీడియోలో పుష్ప చిత్తూరు జైలు నుండి తప్పించుకున్నట్లు బుల్లెట్ గాయాలతో శేషాచలం అడవిలోకి పారిపోయినట్లు అల్లు అర్జున్ ఎంట్రీ సస్పెన్స్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఏప్రిల్ 7 సాయంత్రం 04:05నిమిషాలకు మరో వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈరోజు వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోలో పుష్ప కోసం ప్రజలు మద్దతు తెలపటం ఇంకా శేషాచలం అడవిలోకి పుష్ప పారిపోయినట్లు చూపించారు.
బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులతో నిండిపోయిన పుష్ప షర్ట్ చూపించటంతో అందరూ పుష్ప చనిపోయారని పోలీసులు చంపేశారని ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. కానీ ఓ వ్యక్తి ఓ వీడియో టేప్.. మీడియాకి చూపించడం జరుగుద్ది. ఆ వీడియోలో శేషాచలం అడవిలో పులిరావటం అదే సమయంలో పులికి ఎదురుగా బన్నీ నడవడంతో… పులి నాలుగడుగులు వెనక్కి వేస్తాది. అడవిలో జంతువులు వెనక్కి అడుగులు వేస్తున్నాయంటే పులి వచ్చిందని అర్థం. అదే అడవిలో పులి వెనకడుగులు వేస్తుంది అంటే “పుష్ప” వచ్చాడని అర్థం అంటూ.. డైలాగులు చెబుతుండగా బన్నీ ఎంట్రీ వీడియో అదరగొట్టింది.
ఈ క్రమంలో తగ్గేదేలే మేనరిజంతో వీడియోలో బన్నీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓ పోలిస్ స్టేషన్ లో సెటిల్మెంట్ దగ్గర “పుష్ప ది రూల్” అంటూ బన్నీ పలికే డైలాగ్ వీడియోలో చాలా హైలెట్ అయింది. రేపు బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో.. “పుష్ప ది రూల్” నుండి విడుదలైన వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. చివరిలో పుష్ప సెకండ్ పార్ట్ ఏ ఏ భాషలో విడుదలవుతుందో.. చూపించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో పుష్ప సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండో భాగంలో పుష్ప పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తరహాలో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.