33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun: సందీప్ రెడ్డి వంగ సినిమాపై అల్లు అర్జున్ కామెంట్ కి మురిసిపోతున్న ఫ్యాన్స్..!!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. “పుష్ప” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. “పుష్ప” రాకముందు కేవలం సౌత్ ఇండియాలోనే బన్నీకి మార్కెట్ ఉండేది. “పుష్ప”తో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగం… మొదటి భాగం కంటే అత్యధికమైన ఎక్కువ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Allu Arjun's comment on Sandeep Reddy Vanga movie fans are furious

అయితే ఈ సినిమా ఇంకా కంప్లీట్ అవ్వకముందే నెక్స్ట్ “అర్జున్ రెడ్డి” సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేస్తున్నట్లు బన్నీ ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్టుపై తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ కలయిక కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాను. సందీప్ వంగా మ్యాజిక్ ఏంటో గానీ, ఎక్కడో నన్ను బలంగా తాకింది. మా కాంబినేషన్ లో వచ్చే చిత్రం చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆశిస్తున్నాను” అని బన్నీ ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా టేకింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

Allu Arjun's comment on Sandeep Reddy Vanga movie fans are furious

విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ లో స్టార్ చేసిన సినిమా. అటువంటి హై వోల్టేజ్ ప్రేక్షకులలో తెప్పించే డైరెక్టర్ సందీప్ రెడ్డి తో తమ అభిమాన హీరోకి సినిమా పడటంతో ఫ్యాన్స్ కచ్చితంగా ఈ సినిమా రికార్డులు సెట్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తున్నాను అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారట. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పరంగా చూసుకుంటే వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Bigg Boss Ott: వారం ఉన్న ముమైత్‌కు బిగ్‌బాస్ ఇచ్చిందెంతో తెలుసా?

kavya N

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం

somaraju sharma

RRR: ‘ఆర్ఆర్ఆర్’ మలయాళం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో..!!

sekhar