Allu Arjun: భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించి 69వ జాతీయ అవార్డుల ప్రకటన నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు సినిమాకి ఏకంగా 10 జాతీయ అవార్డులు రావడం జరిగాయి. RRR సినిమాకి ఆరు పుష్ప సినిమాకి రెండు.. ఇంకా కొండ పాలెం, ఉప్పెన సినిమాకి అవార్డులు వరించాయి. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రావటంతో చాలామంది ప్రముఖులు నిన్నటి నుండి ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో నట సింహం నందమూరి బాలయ్య బాబు.. కూడా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం పట్ల స్పందించారు. పనికి అవార్డు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.. దేశ విదేశాలలో తెలుగు సినిమా సత్తా చాటటం సంతోషాన్ని కలిగిస్తూ ఉందని చెప్పుకొచ్చారు.
విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి.. పరిశ్రమ ఎదిగిందని చెప్పుకొచ్చారు. ‘‘సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు రావడం అనేది.. ఓ నటుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మా నటులందరికీ అదొక గర్వకారణం. ఆర్ఆర్ఆర్ సినిమాకు 6 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు సాధించింది. ఉప్పెన చిత్రానికీ జాతీయ అవార్డు వచ్చింది. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని చెప్పారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మొట్టమొదటిసారి తెలుగు చలనచిత్ర రంగంలో అల్లు అర్జున్ సాధించటంతో.. ఇది ఒక రికార్డుగా నెలకొంది. నిన్నటి నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు మరియు ప్రముఖులు రాజకీయ నాయకులు అల్లు అర్జున్ నీ అభినందిస్తున్నారు.
తాజాగా బాలయ్య సైతం బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం పట్ల బెస్ట్ విషెస్ తెలియజేశారు. 2021 ఏడాదికి సంబంధించి పుష్ప సినిమాకి గాను ఈ అవార్డు బన్నీకి వరించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల అయి భారీ విజయాన్ని అందుకుంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ మరియు డైలాగులు.. అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. దీంతో బన్నీకి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు రాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అవార్డు గెలవడం జరిగింది.