Pushpa: అల్లు వారి అబ్బాయి.. అల్లు అర్జున్ కి వున్న క్రేజ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. అది ఈరోజు రిలీజైన పుష్పను అడిగితే చెబుతుంది. ఒక్క తెలుగునాటే కాకుండా కేరళలో కూడా మంచి పేరు సంపాదించుకున్న నటుడు వున్నాడు అంటే.. అది మన బన్నీనే. అవును మరి.. అతనికున్న క్రేజ్ అలాంటిది మరి. రేసుగుర్రం సినిమాతో మనవాడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆర్యతో ఏకంగా కేరళ మీదే కన్నేశాడు మన బన్నీ. ఈరోజు రిలీజైన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో రిలీజు అవడం కొసమెరుపు.
Pushpa Review: పుష్ప రివ్యూ
అల్లు అయాన్ ఏం చేసాడు?
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి తెలుగు పరిశ్రమ వర్గాలు, మరియు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే ఇందులో బన్నీ తనయుడు అల్లు అయాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తండ్రి నటించిన `పుష్ప` విజయాన్ని కాంక్షిస్తూ.. అల్లు అయాన్ వేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వైట్ పేపర్ పై పెన్సిల్ తో ఓ డ్రాయింగ్ వేసి, ఆ ఫొటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు. దాంతో అది కాస్త వైరల్ అయింది.
Pushpa: అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి..!!
అల్లు అర్జున్ రియాక్షన్ ఏమిటి?
దానికి తండ్రి పొంగిపోతూ.. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దాంతో ఫోటో వైరల్ అయింది. ఇంతకీ ఆ ఫోటో లో అయాన్ ఏం వేసాడో తెలుసా? మన బన్నీ ఫోటోనే. పుష్ప పోస్టర్ లో మన బన్నీ గొడ్డలి పట్టుకొని ఉంటాడు కదా! ఆ ఫోటోనే డ్రాయింగ్ వేసి తండ్రికి కానుకగా ఇచ్చాడు అయాన్. దానికి సంబర పడిపోతూ.. ‘థ్యాంక్యూ సోమచ్ నా చిన్ని బాబు.. ఐ లవ్యూ మై అయాన్.’ అని బన్నీ తిరిగి ఆ డ్రాయింగ్ ని షేర్ చేసాడు. అదన్నమాట విషయం. సెలబ్రిటీ తుమ్మినా, దగ్గినా వార్తే కదా మరి!