Chiranjeevi: మెగా హీరోలలో చాలా డిఫరెంట్ ఐకాన్ స్టార్ బన్నీ. ప్రతి సినిమాకి మేకోవర్ మారుస్తూ.. అభిమానులను బన్నీ అలరిస్తూ ఉంటారు. మొదటి సినిమా నుండి “పుష్ప” సినిమా వరకు ప్రతి సినిమాకి తనలో నటన పరంగా…లుక్ పరంగా అనేక వేరియేషన్ లు చూపిస్తున్నాడు. కెరీర్ పరంగా ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో “పుష్ప”తో ఇండియా తో పాటు ప్రపంచాన్ని బన్నీ షేక్ చేసి పడేసాడు. ఈ సినిమాలో బన్నీ స్టెప్పులకు.. పలికిన డైలాగులకు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా గ్రౌండ్ లో .. “పుష్ప”లో బన్నీ పలికిన డైలాగులు… వేసిన స్టెప్పులతో… చెలరేగిపోయారు.
కొంతమంది ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వీడియోలు చేసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ ప్రయాణం దినదినం పెరుగుతూనే ఉందని మెగాస్టార్ చిరంజీవితో కొంత మంది ఇటీవల పోలుస్తూ వార్తలు రావడంతో ఈ విషయంపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ స్పందించారు. విషయంలోకి వెళితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో “గని” సినిమా చేయటం తెలిసిందే. ఏప్రిల్ 8 వ తారీకు విడుదల అవుతున్న ఈ సినిమాకి ఫస్ట్ టైం నిర్మాతగా అల్లు బాబి … గీతా ఆర్ట్స్ బ్యానర్ తరఫున పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది.
దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు తనదైన శైలిలో అల్లు బాబీ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి తాజా ఇంటర్వ్యూలో… చిరంజీవితో బన్నీని పోల్చటం.. దానిపై ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు బాబీ స్పందిస్తూ…” నేను ఎప్పుడూ చిరంజీవిగారిని బన్నీ తో పోల్చి చూడలేదు… అది కరెక్ట్ కాదు కూడా. చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో కష్టాలు పడ్డారు. వాటన్నిటినీ అధిగమించి మెగాస్టార్ అయ్యారు. బన్నీ వెనకాల మా తాతయ్య… మా నాన్నగారు ఉన్నారు. మా అందరికీ స్ఫూర్తి చిరంజీవిగారే. బన్నీ కూడా తనకు స్ఫూర్తి చిరంజీవి గారే. ఈ విషయాన్ని అనేకసార్లు బన్నీ కూడా చెప్పాడు. దీంతో మనలో స్ఫూర్తిని నింపిన వ్యక్తితో మనం ఎప్పుడు పోల్చకూడదు… అంటూ అల్లు బాబీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!