Allu Shirish : ఆటో డ్రైవర్ గా మెగా హీరో..??

Share

Allu Shirish : కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు గత ఏడాది మెగా కాంపౌండ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా తప్ప మరేది రిలీజ్ కాలేదు. కానీ ఈ ఏడాది మెగా అభిమానులను అలరించడానికి వరుస ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా రిలీజ్ అయి ఊహించని బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో నెక్స్ట్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం మాత్రమేకాక అక్టోబర్ నెలలో “ఆర్ఆర్ఆర్” విడుదల అవటానికి సిద్ధంగా ఉండటంతో.. ఈ సినిమాలు రిలీజ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Allu Shirish: Mega hero as an auto driver .. ??
Allu Shirish: Mega hero as an auto driver .. ??

ఇదిలా ఉంటే అన్న అల్లు అర్జున్ మాదిరిగానే డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు మెగా హీరో అల్లు శిరీష్. దీనిలో భాగంగా తన కొత్త సినిమా లో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మొట్టమొదటిసారి సరికొత్త మాస్ క్యారెక్టర్ చేయబోతున్న నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

అల్లు అర్జున్ ఒక పక్క క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ ని అలరించే విధంగా సినిమా లు చేస్తూ ఉండటం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో భయంకరమైన ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. లారీ డ్రైవర్ పాత్రలో.. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తుంటే, ఆటోడ్రైవర్ పాత్రలో అల్లు శిరీష్ నటించడానికి రెడీ అవటంతో అల్లు కుటుంబానికి చెందిన అల్లు బ్రదర్స్ మాస్ ఆడియన్స్ అలరించటానికి రెడీ అవుతున్నారని తాజాగా వీరు చేస్తున్న సినిమాలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


Share

Related posts

సుప్రీం మెట్లెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత

sarath

ఆ మాట అనే హక్కు మీకూ – మీ మావ కే‌సి‌ఆర్ కీ లేదు, హరీష్ రావు గారూ … !!

arun kanna

అత్యాచార బాధితురాలినే తప్పుబట్టిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు!పెల్లుబుకుతున్న నిరసనలు!!

Yandamuri