సినిమా

Allu Shrish: అల్లు కుటుంబంలో విబేధాలు..అల్లు శిరీష్ ట్వీట్‌కి అర్థం అదేనా?

Share

Allu Shrish: ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ స్థాపించిన ఆహా.. సిరీస్ ల నుండి షోల వరకు, ఒరిజినల్స్ నుండి మూవీస్ వరకు అన్నిటితోనూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. దీంతో అన‌తి కాలంలోనే భారీ ప్ర‌జాదారణ పొందిన ఆహాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే ఆహా యాప్ విష‌యంలో తాజాగా అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్‌ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఆహా స‌బ్‌ స్క్రైబర్స్‌లో ఓ వ్య‌క్తి ఆ యాప్‌లో సాంకేతిక‌ సమస్యలను ఎదుర్కొంటున్నాను, దాన్ని వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ల‌తో పాటు అల్లు శిరీష్‌లను కూడా త‌న ట్వీట్‌కి ట్యాగ్ చేశాడు.

allu sirish shocking tweet about aha app
allu sirish shocking tweet about aha app

దాంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన అల్లు శిరీష్‌.. స‌ద‌రు వ్య‌క్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ `ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారు. చాలామంది నేను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్‌ని చూడండి` అంటూ పోస్ట్ చేశాడు.

శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో అల్లు అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు సైతం షాక్ అయ్యారు. తండ్రి స్థాపించిన `ఆహా` యాప్‌కి త‌న‌కు ఎలాంటి సంబంధ‌మూ లేద‌న్నట్లు శిరీష్ ఎందుకు ట్వీట్ చేశాడు..? అల్లు కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? శిరీష్ ట్వీట్‌కి అర్థం అదేనా..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి శిరీష్ ట్వీట్ మాత్రం నెట్టింట ర‌క‌ర‌కాల‌ చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.

 


Share

Related posts

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నది.. వరుడు మీకు సూపరిచితమే!!

Naina

పూజా హెగ్డే, రష్మిక మందన్న కాదు కీర్తి సురేష్ ..ఇదే ఫిక్సవండి ..!

GRK

ఒప్పందం కుదిరింది.. ఇక లాభాలను పంచుకోవడమే ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar