సక్సెస్ ఫార్ములాని పట్టుకోలేకపోతున్నాడు

మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సాలీడ్ హిట్‌కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన శ్రీరస్తు శుభమస్తు మూవీతో బిలో యావరేజ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. అన్న అల్లు అర్జున్, నాన్ని అల్లు అరవింద్ బ్యాక్ సపోర్ట్ ఉన్నా మంచి కథలను ఎన్నుకోవడంలో విఫలం అవుతున్నాడు. హీరో ఎంట్రీ ఇస్తునే బన్నీ స్టార్ డమ్ తెచ్చుకుంటే శిరీష్ మాత్రం ఇంకా హిట్టు కోసం తంటాలు పడుతునే ఉన్నాడు.

హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు అల్లు శిరీష్. లాస్ట్ ఇయర్ చేసిన ఒక్కక్షణం సినిమా భారీ సక్సెస్ ఇస్తోందనుకుంటే బాక్సఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం మలయాళ రీమేక్ ఏబీసీడీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్ మంచి రెస్పాన్ వచ్చింది.

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి యష్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మాస్తున్న ఈ సినిమా తన కెరీర్‌కు మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు శిరీష్. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీష్‌కు ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.