స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటిస్తోన్న 19వ చిత్రమిది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ భావిస్తుందట. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి బాలయ్య రూలర్.. రజనీకాంత్ దర్బార్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. మరెన్ని ఇంకా సంక్రాంతి రేసులోకి వస్తాయో ఇప్పుడే చెప్పలేం కానీ.. బన్నీ మాత్రం సంక్రాంతి రేసులోకి దిగాలనుకుంటున్నారట. మరి బన్ని సంక్రాంతి విజేతగా నిలుస్తారో లేదో చూడాలి.
previous post
next post