అమల అక్కినేని.. అవకాశం ఉన్న ప్రతిసారీ.. నటనపై తన మక్కువను తీర్చుకుంటున్నారు. సూట్ అయ్యే పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. 1993లో వచ్చిన ‘ఆగ్రహం’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న ఆమె.. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘మనం’ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. తాజాగా ఆమె మరో సినిమాకు సైన్ చేశారట. బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటించనున్నారట. గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తల్లి పాత్రను అమల పోషించనున్నారట. ఇప్పటికే గోపీచంద్ పాత్ర కోసం సుధీర్ బాబు.. తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారట. ఆటగాడిలా మారేందుకు కసరత్తులు చేస్తున్నారట. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రీప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!