Raviteja: మాస్ మహారాజా రవితేజ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గత ఏడాది “క్రాక్” సినిమా చేసే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. సరిగ్గా కరోనా వైరస్ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయిన ప్రారంభం లో.. రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో హిట్ ట్రాక్ లో పడ్డాడు. గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడం మాత్రమే కాక హ్యాట్రిక్.. నమోదయింది ఇద్దరికీ.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ “కిలాడీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్య ప్రస్తుతం సినిమా థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో కిలాడి సినిమా నిర్మాతలకు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు… చాలా పెద్ద ఆఫర్… ప్రొడ్యూసర్స్ కి ఇచ్చినట్లు… ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాక… మరికొన్ని ఓటీటీ సంస్థలు… కిలాడి సినిమా అని కొనటానికి పోటీ పడుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… పాటు మరణాలు సంభవిస్తు ఉండటంతో… థియేటర్లో ఓపెన్ అయినా ఆడియన్స్ వచ్చే పరిస్థితి ఉండదని ఓటీటీ సంస్థలు… ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టులకు బిగ్ ఆఫర్ లు అందిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చాలా సినిమాల నిర్మాతలు ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఓటిటి సంస్థ లా వైపే చూస్తున్నారు.