Categories: సినిమా

RRR OTT: రాజ‌మౌళికి అమెజాన్ క‌ళ్ళు చెదిరే ఆఫ‌ర్‌..ఎంతో తెలిస్తే మ‌తిపోద్ది!

Share

RRR OTT: ద‌ర్శ‌క‌ధీరుడు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోయిలుగా న‌టించారు. వీరిద్ద‌రికీ జోడీగా అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్‌, శ్రీయ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

amazon prime huge offer to rrr movie

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు క‌లిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంది అనే క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్‌ చిత్రం ఈ ఏడాది జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక భాష‌ల్లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రామ్ వెలుగు చూడ‌టం, మ‌రోవైపు క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతుండ‌డంతో.. ప‌లు రాష్ట్రాలు మ‌ళ్లీ ఆంక్ష‌ల వ‌ల‌యంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్‌ను వాయిదా వేశారు మేక‌ర్స్‌.

amazon prime huge offer to rrr movie

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని త‌మ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయాలంటూ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లైన‌ రాజ‌మౌళి, దాన‌య్య‌ల‌కు క‌ళ్ళు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఎంతో తెలుసా.. రూ.200 కోట్లు. ఈ ఫిగ‌ర్ వింటే ఎవ్వ‌రికైనా మ‌తిపోతుంది. అలాగే చేతులారా ఎవ్వ‌రూ ఇటువంటి ఆఫ‌ర్‌ను వ‌దులుకోరు. కానీ, ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ మాత్రం రిజెక్ట్ చేశారు. ఎందుకంటే, ఈ సినిమా కోసం రూ.400 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టారు. రూ. 200 కోట్ల‌కే సినిమాను ఇచ్చేస్తే పెట్టిన ఖ‌ర్చు కూడా రాదు. ఇక ఆర్ఆర్ఆర్ ను మొద‌టి నుంచి థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్‌ గ‌ట్టిగా భీష్మించుకున్నారు. అందువ‌ల్ల‌నే అమెజాన్ ఆఫ‌ర్‌ను జ‌క్క‌న్న‌, దాన‌య్య‌లు సున్నితంగా రిజెక్ట్ చేశార‌ట‌.

 


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

24 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago