Ameer Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అమీర్ సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటన అని రాగానే సోషల్ మీడియాలో నార్త్ ప్రేక్షకులు తమ బాధను వెళ్లగక్కారు. అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అనే విషయం వారిని తీవ్ర సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దాంతో స్వయంగా అమీర్ రంగంలోకి దిగి వారిని వారించాల్సిన పరిస్థితి వచ్చింది.
YCP MLA RK Roja: నగరి నియోజకవర్గం మొత్తాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ వినతి .. ఎమ్మెల్యే రోజా స్ట్రాటజీ మామూలుగా లేదుగా..!!.
Ameer Khan:అసలు విషయం ఇదే:
అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ ఓ సమయంలో బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి ఎక్కువకాలం పాటు దూరమయ్యాడట. ఇక ఆ సమయంలో పిల్లలను చాలా మిస్ అయ్యాడట అమీర్. దీంతో సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించి.. పిల్లలతో సమయం గడపాలని అనుకున్నాడట! ఇక ఈ రిటైర్ మెంట్ ఆలోచన తన ఇంట్లో చెప్తే వాళ్ళ కుటుంబసభ్యులు తప్పుడు ఆలోచన అని చెప్పి మార్చుకోవాలని సూచించారట.
Aamir Khan : అమీర్ ఖాన్ కి కరోనా పాజిటివ్..!!
మరింత సమాచారం:
ఇక సినిమానే తనకి, తన కుటుంబానికి గ్యాప్ వచ్చేలా చేసిందని, ఈ నిర్ణయం వారికి చెప్పగా వారు విభేదించారట. ఈ క్రమంలో అమీర్ రిటైర్ మెంట్ నిర్ణయం వాళ్ళ ఇంట్లో పెద్ద తుఫాన్ నే తీసుకొచ్చింది. ఆ సమయంలో కిరణ్ అమీర్ ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసి, ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి అని బతిమాలిందట. దాంతో అమీర్ అర్ధం చేసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక ఈ విషయాలు తెలుసుకున్న అభిమానులు ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు.