బాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కన్నడంలో ఓ పాట పాడారు. బాలీవుడ్ కన్నడ రీమేక్ వెర్షన్ బటర్‌ఫ్లై చిత్రంలో బిగ్ బి పాట పాడారట. 1979 నుండి ఆడపా దడపా పాటలు పాడుతూనే ఉన్నారు బిగ్ బి. ఈ 76 ఏళ్ల సూపర్‌స్టార్ సినిమాలతో పాటు.. కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా.. గొంతు సవరించుకుంటున్నారు. రీసెంట్గా కూడా బాలీవుడ్ చిత్రం `బద్లా`లో కూడా పాట పాడారు అమితాబ్. ఈ క్రమంలో బటర్ ఫ్లైలో పాట పాడారు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగులో సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తన్నారు. అలాగే ఎస్.జె.సూర్య సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కన్నడంలో పాట పాడారు. మరి పాటను యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూద్దాం…
previous post
next post