ఎమోష‌న‌ల్ అయిన అమితాబ్‌

Share


బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యాన్స్ త‌న‌పై చూపిస్తున్న ప్రేమాభిమాల‌ను చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న బ్లాగులో రాసుకొచ్చారు. సాధార‌ణంగా ప్ర‌తి ఆదివారం అమితాబ్ త‌న ఇంటి ముందున్న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంటారు. అయితే ఈ ఆదివారం జోరు ప‌డుతున్న వ‌ర్షం కార‌ణంగా ఎవ‌రు రారులే? అనుకున్నార‌ట‌. అయితే.. జోరు వాన‌లో కూడా అభిమానులు ఆయ‌న కోసం వేచి చూశార‌ట‌. వారిని ప‌ల‌క‌రించి ఫొటో దిగిన అమితాబ్‌.. ఈ విష‌యాన్ని త‌న బ్లాగులో రాసుకున్నారు. “జోరున వ‌ర్షంతో పాటు మీ ప్రేమాభిమానాలు కూడా కురిశాయి. న‌న్ను చూడ‌టం కోసం ఎంతో దూరం నుండి వ‌చ్చిన అభిమానులు వ‌ర్షంలోనూ గేటు ముందు నిలుచుకుని ఉండటం చూస్తే మీ ప్రేమేంటో తెలుస్తుంది. ఇలాంటి ప్రేమ‌ను పొంద‌డం నిజంగా నా అదృష్టం“ అని తెలిపారు బిగ్ బి.


Share

Related posts

ముహూర్తం కుదిరింది…

Siva Prasad

అయ్యో కామెడీ చేసేశారే

Siva Prasad

నాగ్ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ??? సమంత మీద ఫుల్ నమ్మకంతో ! 

sekhar

Leave a Comment