Amitabh Bachchan Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. 2021 లో వచ్చిన పుష్ప సినిమా బన్నీ తలరాతను మార్చేసింది. అంతకుముందు బన్నీకి సౌత్ ఇండియాలో మాత్రమే మార్కెట్ ఉండేది. పుష్ప సినిమా పుణ్యమా దేశాంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. పైగా ఇటీవల పుష్ప సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకోవటం జరిగింది. తెలుగులో ఇప్పటివరకు ఏ హీరో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోలేకపోయారు. మొట్టమొదటిగా బన్నీకి రావటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు.
“పుష్ప” సినిమా అల్లు అర్జున్ కి మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా పుష్ప సినిమాలోని పాట గురించి బిగ్ బి అమితాబ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే అమితాబ్ ఎన్నో ఏళ్ల నుంచి “కౌన్ బనేగా కరోడ్ పతి” అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ ల వారీగా ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ఉంది. ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ బన్నీకి సంబంధించిన ప్రశ్న రాగా… శ్రీవల్లి పాటలు బన్నీ వేసిన స్టెప్ గురించి.. అమితాబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాటలో చెప్పు వదిలేసిన వైరల్ కావటం నా జీవితంలో మొదటిసారి చూశాను. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెప్ వేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేశారు.
ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునేవారు అంటూ.. నిజంగా అల్లు అర్జున్ అద్భుతంగా డాన్స్ వేసినట్లు బిగ్ బి పొగడ్తలతో ముంచేత్తారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అప్పట్లో శ్రీవల్లి సాంగ్ పాటకి లాక్ డౌన్ సమయంలో.. చాలామంది సెలబ్రిటీలు క్రికెటర్స్ ఇతర దేశాలకు చెందిన వాళ్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ వీడియోలకు బాగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. “పుష్ప” సినిమాకి సంబంధించి చేసిన వీడియోలు చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది.