సినిమా

అమితాబ్, చిరు, రజినీ.. 25 ఏళ్లు వెనక్కి వెళ్తే..! పూరి మాటల్లో..!!

amitabh chiranjeevi rajinikanth do wonders again
Share

అభిమాన హీరోలకు కటౌట్లు, బ్యానర్లు కట్టి పూలదండలు వేస్తారు, హారతులు పడతారు, గుళ్లో పూజలు చేస్తారు, తెరపై అభిమాన హీరో కనపిస్తే పూనకం వచ్చేస్తుంది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్.. లకు ఈ ఫ్యానిజం మరింత ఎక్కువ. వీరంతా ఫ్యాన్స్ కు డెమీ గాడ్స్. ఇప్పుడు వారంతా 65 ఏళ్ల వయసు దాటి ఉన్నారు. కానీ.. వీరు పాతికేళ్లు వెనక్కు వెళ్లి మళ్లీ ఆ శక్తి తెచ్చుకోవచ్చని తన పూరి మ్యూజింగ్స్ లో చెప్పుకొచ్చాడు డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్.

amitabh chiranjeevi rajinikanth do wonders again
amitabh chiranjeevi rajinikanth do wonders again

‘వృద్ధాప్యం రాకుండా వయసును ఆపొచ్చని, వయసుని వెనక్కు తీసుకురావొచ్చని ఇజ్రాయల్ శాస్త్రవేత్తలు నిరూపించారు. మన శరీరంలో డీఎన్ఏకు సంబంధించిన ‘టిలోమీర్’ పొడుగ్గా వుండి చివరలో షూ లేస్ లా గట్టిగా ఉంటుంది. టిలోమీర్ చివరన ఉండే క్రోమోజోమ్స్ మెల్లగా చెరిగి, కరిగిపోవడంతో మనకు వృద్ధాప్యం వస్తుంది. టిలోమీర్ చిన్నగా అయిపోతుంది. ఈ ఎడ్జెస్ రిపేర్ చేసి.. ఆ క్యాప్స్ ను స్ట్రాంగ్ చేస్తే మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోతారు. దీనిని ఆక్సిజన్ అందించి సరి చేయొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ ట్రీట్ మెంట్ పేరు HBOT (హైపర్ బారీ ఆక్సిజన్ ట్రీట్మెంట్) . 65ఏళ్లు దాటిన 35 మందిని ప్రెజురైజ్డ్ ఆక్సిజన్ చాంబర్ లో కూర్చోబెట్టి గంటన్నర పాటు ప్రతి రోజూ వారానికి 5సార్లు చొప్పున ఆక్సిజన్ అందించారు’.

‘ఇలా మూడు నెలల ట్రీట్మెంట్ తో వారంతా 25ఏళ్లు తగ్గి 45 ఏళ్ల వారిలా మారిపోయారు. ఈ మూడు నెలలు ఆక్సిజన్ అందించడంతో వాళ్ల టిలోమీర్ ఎండ్ క్యాప్స్ స్ట్రాంగ్ అయిపోయాయి. క్రోమోజోమ్స్ రీబిల్డ్ అయ్యాయి. ఇది ప్రూవ్ అయింది కూడా. దీంతో ఊడిపోయిన జుట్టు కూడా వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది చాలామందికి పండగ లాంటి న్యూస్. ఈ ట్రీట్మెంట్ త్వరలో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదే నిజమైతే 60లు దాటిన మన హీరోలు అమితాబ్, మెగాస్టార్, రజినీకాంత్.. వీళ్లంతా 25 ఏళ్లు వెనక్కు వెళ్లి మళ్లీ వండర్స్ చేసేస్తారు. స్క్రీన్లు చిరిగిపోతాయి’ అని చెప్పుకొచ్చాడు పూరి. ఎవరైనా మళ్లీ వండర్స్ చేయొచ్చంటున్నాడు. ఇది అందరికీ శుభవార్త అంటున్నాడు పూరి.


Share

Related posts

Aacharya: “ఆచార్య”లో తన ఫేవరెట్ సీన్ చెప్పినా రామ్ చరణ్..!!

sekhar

Oke Oka Jeevitham: ఆకట్టుకుంటున్న “ఒకే ఒక జీవితం” మోషన్ పోస్టర్..!!

bharani jella

ఖ‌రీదైన కారుని కొన్న స్టార్ హీరో

Siva Prasad