Prabhas: డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ వెరైటీ కాన్సెప్ట్ కలిసిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో టాప్ మోస్ట్ బ్యానర్ గా పేరొందిన వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్ లో 51 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మాత అశ్వినీదత్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా టైటిల్ కూడా పెట్టని ఈ సినిమా కి ప్రాజెక్ట్ కే అనే పేరుతో… షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ తరుణంలో తాజాగా సినిమా షూటింగ్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా సత్తా చాటుతూ ఉండటంతో అమితాబచ్చన్ ప్రభాస్ తో షూటింగ్ అనుభవం గురించి సోషల్ మీడియాలో … పొగుడుతూ పోస్ట్ పెట్టారు. బాహుబలి హీరో తో ఫస్ట్ షార్ట్ ఫస్ట్ డే ఫస్ట్ ఫిలిం… అనుభవం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇదొక ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభాస్ టాలెంట్ చాలా అద్భుతం అని ముఖ్యంగా ఇతరులతో చాలా డౌన్ టు ఎర్త్..గా పలకరించడం చాలా విషయాలు అతనిలో నేర్చుకోవచ్చని అమితాబచ్చన్ సోషల్ మీడియా లో సంచలనం పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రభాస్ కూడా అమితాబ్ బచ్చన్ తో షూటింగ్ అనుభవం గురించి పోస్ట్ పెట్టారు. నా కల నిజమైంది. ప్రాజెక్ట్ కే .. ఫస్ట్ షార్ట్ లెజెండరీ నటుడు అమితాబ్ తో నటించడం జరిగింది అంటూ తన ఆనందాన్ని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఎంచుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!