సినిమా

Webseries: వెబ్ సిరీస్ చేసి, ఏకంగా బడా సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న నటి?

Share

Webseries: సాహెర్ బాంబా పేరు వినే వుంటారు. హిందీ వెబ్ సిరీస్ ని ఫాలో అవుతున్న వారికి బాగా తెలిసిన నటి. ఈమె పుట్టి పెరిగింది సిమ్లాలో. తల్లి పేరు శిల, తండ్రి సునీల్‌ బాంబా. ముంబైలోని జై హింద్‌ కాలేజీలో సాహెర్‌ డిగ్రీ పట్టా పుచుకుంది. సాహెర్‌ మంచి యోగా నిపుణురాలు కూడా. క్రమం తప్పని కథక్, యోగా ప్రాక్టీస్ చేయడం వలన ఆమె శరీరం మంచి ఫిట్‌ గా వుంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. వెబ్‌ సిరీస్ కంటే ముందు బిగ్‌ స్క్రీన్‌ మీదే కనిపించింది మన సాహెర్. ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ సినిమాతో ఈమె బాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఫేమస్ అయింది మాత్రం వెబ్ సిరిస్ తోనే.

Webseries: ఒప్పో బాంబే టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌:

డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సాహెర్ మోడల్ రంగంలో ప్రవేశించి రాణించింది. 2016లో ఒప్పో బాంబే టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ కూడా గెలుచుకుంది. దానికి సంబంధించిన ఇమేజ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. చిన్నప్పుడే కథక్‌ డాన్స్‌ నేర్చుకుంది. డ్యాన్స్‌ మీదున్న మక్కువే నటన మీద కుతూహలాన్ని, ఆసక్తిని పెంచిందని ఆమె ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో ‘దిల్‌ బేకరార్‌’ సిరీస్‌తో ఈమె వెబ్‌ ఎంట్రీ ఇచ్చింది. సినిమా కంటే కూడా ఆ సిరీస్‌తోనే పాపులారిటీ సంపాదించుకుంది.

అలా సినిమా అవకాశాలు:

ఈమె వెబ్‌ సిరీస్‌లో చేస్తున్నపుడు, దాని వల్ల సినిమా అవకాశాలు పోతాయని చాలా మంది పెద్దలు హెచ్చరించారట. కానీ కరోనాలో సమయంలో ఆమెను బిజీగా ఉంచింది ఈ వెబ్‌ సిరీసే. దీని వలెనే ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చినట్టు చెప్పుకొచ్చింది. పైగా ఎక్కువ మంది ప్రేక్షకులకూ దగ్గర చేసింది ఈ వెబ్ సిరీస్ అని గర్వంగా చెబుతోంది. అందుకే ఆమె రెండిటికీ ఈక్వల్‌ ప్రయారిటీ ఇస్తానంటోంది. ఇకపోతే బాలీవుడ్ బడా డైరెక్టర్ ఐనటువంటి సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమా కోసం ఆమెను సంప్రదించనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే గాని నిజమైతే ఆమె దశ తిరిగినట్టే.


Share

Related posts

Allu Arjun: `కేజీఎఫ్ 2` వీక్షించిన బ‌న్నీ.. రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

kavya N

Devatha Serial: రాధకు ఎదురుతిరిగిన రామ్మూర్తి, జానకమ్మ దేవుడమ్మా ఇంట్లో..

bharani jella

Radhika Preethi Beautiful Pics

Gallery Desk