Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2007లో రవి వర్మన్ దర్శకత్వంలో “మాస్కోవిన్ కావేరి” సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగులో “ఏ మాయ చేసావే” సినిమాతో… హీరోయిన్ గా అరంగేట్రం చేయడం జరిగింది. 2010లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేమ కథ నేపథ్యంలో నాగచైతన్య కెరియర్ లో తొలి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరి కొంతమంది హీరోలతో వరస పెట్టి సినిమా అవకాశాలు అందుకోవటం జరిగింది.
అనంతరం 2017లో అక్కినేని నాగచైతన్యనీ సమంత ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. నాలుగు సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోవడం జరిగింది. ఈ క్రమంలో సమంత కెరియర్ పరంగా మంచి అవకాశాలు అందుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ “పుష్ప” లో ఐటెం సాంగ్ చేసి అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు నాలుగు నెలలపాటు హాస్పిటల్ పాలైన సమంత ఈ మధ్య కోలుకుంటూ ఉంది. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో షూటింగ్స్ మొత్తం ఆపేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు శుక్రవారం సమంత పుట్టినరోజు కావడంతో ఆమె వీరాభిమాని ఏపీ వాసి బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ తన ఇంట్లోనే సమంతకు గుడి కట్టాడు. ఆమె పుట్టినరోజు నాడు ఓపెన్ చేయడం జరిగింది. సమంత సినిమా కెరియర్ స్టార్టింగ్ నుంచి తాను అభిమాని అని సందీప్ తెలియజేయడం జరిగింది. ఆమె స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో కుటుంబాలకు చేస్తున్న సహాయం తనకి ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మయోసైటీస్ తో బాధపడుతున్న సమంత త్వరగా కోలుకోవాలని తిరుపతి, చెన్నై, నాగపట్నం క్షేత్రాలకు తీర్థయాత్రలు చేసినట్లు సందీప్ స్పష్టం చేశారు.