Priya Aunty: ప్రియా ఆంటీ అందరికీ సుపరిచితురాలే. టీవీ సీరియల్స్.. నటిస్తూ మరోపక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తూ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో… కంటెస్టెంట్ గా కూడా రాణించటం జరిగింది. ముక్కుసూటి తనంతో పాటు ఎవరినైనా కడిగేసే రీతిలో ప్రియ ఆంటీ.. గేమ్ ఆడింది. సీజన్ 5 విన్నర్ సన్నీ తో.. హౌస్ లో ఎక్కువగా గొడవ పడింది. ఈ క్రమంలో టాప్ 5కి చేరకముందగానే.. ఎలిమినేట్ కావడం జరిగింది. బిగ్ బాస్ కి వెళ్ళాక మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ప్రియ ఆంటీ సొంతం. దాదాపు 40 సంవత్సరాల వయసుకు పైగా కలిగిన ప్రియా ఆంటీ జీవితంలో ఎవరికి తెలియని కోణం ముఖ్యంగా ఆమె భర్తతో ఎందుకు విడిపోయింది… ఇంకా అనేక విషయాలు తాజాగా సోషల్ మీడియాలో బయటపడ్డాయి.
ప్రియా ఆంటీ అసలు పేరు మామిళ్ళపల్లి ప్రియా శైలజ. 1996లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. మాస్టర్ సినిమా సూపర్ హిట్ అయినా గాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఎక్కడ నిరుత్సాహపడక బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని సీరియల్ నటిగా ప్రియా ఆంటీ పాపులర్ అయింది. అప్పట్లో “ప్రియసఖి” సీరియల్ లో నటించి.. తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ రకంగా ప్రియా ఆంటీ గా పేరు సంపాదించింది. ఒకపక్క సీరియల్ లో బిజీ అవుతూనే మరోపక్క బుల్లితెరలో కూడా వరుస పెట్టి అవకాశాలు అందుకుని రెండు రంగాలను ఏలేసింది. తెలుగులో చాలా సినిమాలలో ఆంటీ పాత్రలలో ప్రియా ఆంటీ కనిపించడం జరిగింది.
ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ప్రియా ఆంటీ వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడింది. 2002వ సంవత్సరంలో కిషోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చాక భర్తతో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్త దూరమయ్యాక కూడా ప్రియా ఆంటి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. సినిమాలు చేస్తూ వస్తూ ఉంది. అయితే భర్తతో ప్రియా ఆంటీకి గొడవలకు కారణం పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీకి దూరమవ్వాలని సినిమాలు మేకప్ వద్దని చెప్పటంతో.. రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతూ ఉండటంతో భర్త తీరు నచ్చక వెంటనే విడిపోవడం జరిగిందంట. వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న ప్రియా ఆంటీ.. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా మంచి అవకాశాలతో దూసుకుపోతూ ఉంది. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటూ ఉంది.