సినిమా

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ అలాంటి వాడా..? గుట్టంతా విప్పిన `లైగ‌ర్‌` బ్యూటీ!

Share

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ నిర్మించారు. పూరీ జ‌గ‌న్నాథ్ సైతం ఈ మూవీకి వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నారు.

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇంటర్నేషన్ బాక్సర్ మైక్ టైసన్, ర‌మ్య‌కృష్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ హీరోయిన్ అయిన అన‌న్య పాండే తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాల‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి వాడో కూడా చెప్పేసింది. `లైగ‌ర్ సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ ప‌నులు పూర్తయ్యాయి, నా డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయింది. ఆగస్టులో సినిమా విడుదలవుతుంది.. ఈ మాంచి మసాలా సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది` అంటూ పేర్కొంది.

ఈ క్ర‌మంలోనే విజ‌య్ గురించి గుట్టిందా విప్పింది. `విజయ్ కు ఎంతో దయాగుణం ఉంది. ఆయ‌న ఓ అద్భుత‌మైన వ్య‌క్తి. అమెరికాలో షూటింగ్ చేసే సమయంలో చాలా సరదాగా గడిపాము. వియ‌జ్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది` అంటూ లైగ‌ర్ బ్యూటీ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

Suju Vasan Traditionl Looks

Gallery Desk

Devi Sriprasad: టాలీవుడ్ లో కాకపోయినా అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్..!!

sekhar

‘నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు..’

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar