Vijay Deverakonda: `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. ప్రస్తుతం ఈయన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో `లైగర్` అనే మూవీ చేస్తున్నాడు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జగన్నాథ్‌లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.
బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన అనన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సినిమాల్లో కనిపించే విజయ్ దేవరకొండ వేరు, అసలు విజయ్ దేవరకొండ వేరు. బయట ఆయన పూర్తి భిన్నంగా ఉంటాడు. అలాగే విజయ్ చాలా పిరికివాడు అని అనన్య డైరెక్ట్‌గానే చెప్పేసింది. ఇంకా మాట్లాడుతూ.. ఆయనతో నటించడం చాలా సరదాగా ఉంటుందని, ఓ నటిగా తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాడని పేర్కొంది.
ఇక విజయ్ నటించిన అర్జున్ రెడ్డి తనకు చాలా ఇష్టమని. కానీ, ఆ సినిమాలో విజయ్ పాత్రకు, బయట తన వ్యక్తిత్వానికి అసలు పొంతనే ఉండదని అనన్య తెలిపింది. దీంతో విజయ్ పిరికివాడా..? అసలు అనన్య నుంచి ఇలాంటి మాటలు అస్సలు ఊహించలేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నాడు.