Mahesh Babu: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ప్రస్తుతం సినిమా రంగంలో తిరుగులేని నటిగా దూసుకుపోతుంది. అంతేకాకుండా అనవసరమైన కొన్ని కామెంట్లు చేసి ఇటీవల ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాను కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులతో అనసూయ గొడవ కొన్ని వారాలు పాటు సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. ఒకపక్క ఇంత కాంట్రవర్సీ జరుగుతున్నా కానీ మరోపక్క అనసూయ కి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తమిళ్ సినిమా రంగంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. అయితే “గుంటూరు కారం” లో అనసూయ చాలా కామెడీ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ అంతకు ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలు అనసూయ కి ఓ పాత్ర ఆఫర్ చేయగా అప్పట్లో డేట్స్ కుదరక.. వదులుకొంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు “గుంటూరు కారం”లో మాత్రం వచ్చినా అవకాశాన్ని అందుకు ఉంచుకొని అనసూయ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో ఒకదానిలో ఒకలా మరొక దానిలో మరొక విధంగా వ్యత్యాసం లేకుండా మహేష్ బాబుని త్రివిక్రమ్ అద్భుతంగా చూపించాడు. దీంతో ఇప్పుడు “గుంటూరు కారం”లో మహేష్ బాబుని ఏరకంగా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. పైగా చాలా సంవత్సరాల తర్వాత మహేష్ ఈ సినిమా కోసం స్మోకింగ్ చేయడంతో పాటు ఫుల్ మాస్ గా కనిపించడంతో అభిమానులు సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు.