NewsOrbit
సినిమా

T.V Actors : సుమ, అనసూయ నుంచి వంటలక్క వంటి టీవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతి పోవాల్సిందే…!

anasuya-bharadwaj-suma-kanakala-to-rashmi-gautam-via-premi-viswanath-many-other-telugu-television-top-anchors-remunerations

T.V Actors : వెండితెరపై హీరోయిన్స్ వారి నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతూ మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. హీరోయిన్ ల తర్వాత బుల్లితెరపై నటిస్తున్నటువంటి యాంకర్లు, సీరియల్ ఆర్టిస్ట్ లు కూడా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ రెండు చేతుల సంపాదిస్తూ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు యాంకర్లుగా చేస్తూ పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. మరి వీరు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం..

anasuya-bharadwaj-suma-kanakala-to-rashmi-gautam-via-premi-viswanath-many-other-telugu-television-top-anchors-remunerations
anasuya bharadwaj suma kanakala to rashmi gautam via premi viswanath many other telugu television top anchors remunerations

బుల్లితెరపై యాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పలు షోలను నిర్వహిస్తూ, మరోవైపు ఆడియో ఫంక్షన్ లు, సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న సుమ ఒక్కో సినిమా ఆడియో ఫంక్షన్ కు 2 నుంచి 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇది కేవలం ఆడియో ఫంక్షన్ కి మాత్రమే, ఇక అవార్డు ఫంక్షన్ అయితే మరొక రేటు ఉంటుందనే సమాచారం వినబడుతుంది.

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న అనసూయ ఒక కార్యక్రమానికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ రష్మి ఒకవైపు ఈవెంట్ చేస్తూ మరోవైపు పలు మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలతో సందడి చేస్తుంటారు. రష్మీ కూడా దాదాపు లక్షన్నర పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కార్తీక దీపం వంటలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఈమెకున్న క్రేజ్ మరే సీరియల్ హీరోయిన్ కి లేదని చెప్పాలి.ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న దీపా ఇదివరకు ఒక్కో ఎపిసోడ్ కు 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ 50,000కు చేరుకుందని సమాచారం. పటాస్ షో ద్వారా పరిచయమైన శ్రీముఖి బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్నారు. శ్రీముఖి ఒక్కో కార్యక్రమానికి దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

యాంకర్ శ్యామల పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈమె ఒక్కో కార్యక్రమానికి 40 నుంచి 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. టీవీ ఆర్టిస్ట్ పల్లవి రామ్ శెట్టి ఎపిసోడ్ 15 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ నుంచి టీవీ నటిగా మారిన సుహాసిని ఒక్కో ఎపిసోడ్ కు 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పలు టీవీ సీరియల్స్ లో నటించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి హరిత ఒక్కో ఎపిసోడ్ కు 12 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. పలు టీవీ సీరియల్స్,సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ప్రీతినిగమ్ ఒక్కో ఎపిసోడ్ 10 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారనే సమాచారం తెలుస్తోంది. అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్య 25 వేలు, నవ్య స్వామి ఒక్కోఎపిసోడ్ కి 20 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri