Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా లారీ డ్రైవర్ గా కూడా..నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను బాగా అలరించింది సంగతి తెలిసిందే. సుకుమార్ టేకింగ్ అల్లుఅర్జున్ యాక్టింగ్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అన్న తరహాలో “పుష్ప” టీజర్ సోషల్ మీడియా లో రికార్డులు సృష్టించింది.
ముఖ్యంగా చాలా మాస్ తరహాలో బన్నీ లుక్కు ఉండటంతో..ఫ్యాన్స్ “పుష్ప” సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ లో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసి..సినిమాకే హైలెట్ అయ్యింది. ఇప్పుడు దాని కంటే మించి..పుష్ప సినిమాలో అనసూయ కి సరికొత్త పాత్ర సుకుమార్ కేటాయించడం జరిగిందట. చాలావరకు నెగిటివ్ రోల్ అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.
ఏది ఏమైనా బుల్లితెర హాట్ యాంకర్ గా మంచి క్రేజ్ ఉన్న అనసూయ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు మరియు అభిమానులు ..ఏ విధంగా అనసూయని సుకుమార్ చూపిస్తాడో అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ ఆగస్టు 13 అని తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో .. డిసెంబర్ చివరిలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త ఒకటి వైరల్ అవుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?