Anasuya: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 35 కంటే ఎక్కువ సంవత్సరాలు వయసు కలిగిన అనసూయ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో స్టార్టింగ్ టెలివిజన్ రంగంలో విజయవంతంగా రాణించిన అనసూయ.. ప్రజెంట్ సినిమా ఫీల్డ్ లో దూసుకుపోతుంది. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలో పలు భాషలలో అవకాశాలు అందుకుంటుంది. అంతేకాదు ఒక సినిమా రంగంలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు చేస్తూ కూడా.. రాణిస్తోంది. “రంగస్థలం” సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ గా నిలిచింది. ఇంకా అనేక సినిమాలలో ఆమె చేసిన పాత్రలు చాలామందిని ఆకట్టుకున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తనకి హీరోయిన్ అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. షూటింగ్స్ అయ్యాక జరిగే పార్టీలకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అందువల్లే హీరోయిన్ అవకాశాలు కోల్పోయినట్లు అనసూయ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఒకప్పుడు తీసుకునే దాన్ని. నా పాత్రకే ప్రాధాన్యం ఉండాలనుకుని మిగతా వాటి గురించి ఆలోచించే దాన్ని కాదు. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్రలలోనైనా నటనతో గుర్తింపు తెచ్చుకోగలను అనే నమ్మకం వచ్చింది. ఇక సోషల్ మీడియాలో గొడవలు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో నన్ను విమర్శించే వారితో పాటు నా పోస్టులు ద్వారా స్ఫూర్తి పొందే వాళ్ళు కూడా ఉన్నారు అని అనసూయ స్పష్టం చేసింది.
ఇక ఇదే సమయంలో “అత్తారింటికి దారేది” సినిమాలో ఓ సాంగ్ కోసం అవకాశం కూడా వచ్చింది. చేయబోయే సాంగులో చాలామంది హీరోయిన్స్ ఉంటారు గుంపులో ఒకరిగా నటించాలని చెప్పడంతో అలా చేయటం ఇష్టం లేకే ఆ అవకాశాన్ని వదులుకున్న అని తెలిపారు. ఈ క్రమంలో ఆ సమయంలో సోషల్ మీడియాలో నన్ను బాగా ట్రోల్ చేశారు. దీంతో చెప్పే విధానం సరికాదేమో అని భావించి డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి సారీ కూడా చెప్పాను. ఇంకా ఇదే సమయంలో తన భర్త తనకి చాలా స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తనపై కామెంట్స్ పెట్టే వాళ్ళ ఇళ్లల్లో మహిళలను తలుచుకుంటే జాలేస్తుందని ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది.