NewsOrbit
Entertainment News సినిమా

Anasuya: అసలు విజయ్ దేవరకొండ తో ఎక్కడ నుండి గొడవ స్టార్ట్ అయిందో ఇంటర్వ్యూలో బయటపెట్టిన అనసూయ..!!

Advertisements
Share

Anasuya: గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు అనసూయని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో అనసూయ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండతో గొడవలపై అనసూయ ఓ మీడియా సంస్థతో వివరణ ఇవ్వటం జరిగింది. ఒకప్పుడు విజయ్ తాను స్నేహితులమేని తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో ఎలాంటి సమస్య లేదు. 2017లో “అర్జున్ రెడ్డి” విడుదలైన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.

Advertisements

Anasuya's Sensational Reaction On Quarrels With Vijay Devarakonda

ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతుల డైలాగులు మ్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఓ ధియేటర్ లోకి వెళ్లిన టైంలో మ్యూట్.. చేసిన డైలాగులను థియేటర్ లో ఉన్న ప్రేక్షకుల చేత విజయ్… పలికించాడు. సినిమా వరకు బాగానే ఉంది నిజజీవితంలో ప్రేక్షకుల చేత ఆ పదాలు పలికేల ప్రోత్సహించటం ఏంటి..? ఆ అసభ్యకరమైన పదాలు ఒక తల్లిగా నన్ను ఎంతగానో బాధించాయి. ఆ ఘటనపై విజయ్ తో మాట్లాడాను. అటువంటివి నిజజీవితంలో ప్రోత్సహించొద్దని కోరాను అంటూ అనసూయ వివరించడం జరిగింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మహిళలను యువత దూషించడం పెరిగిపోయింది అంటూ అనసూయ పేర్కొంది.

Advertisements

Anasuya's Sensational Reaction On Quarrels With Vijay Devarakonda

2019వ సంవత్సరంలో విజయ్ దేవరకొండ తండ్రి మీకు మాత్రమే చెబుతూనే సినిమాని నిర్మించిన టైంలో… ఆ సినిమాలో నాకో పాత్ర కూడా ఆఫర్ చేయడం జరిగింది అని అనసూయ తెలియజేస్తుంది. విజయ్ కి చెందిన టీం మెంబెర్ దుర్భాషలాడితో పోస్టులు పెడుతూ పేయిడ్ ట్రోల్ చేస్తున్నప్పుడు… విజయ్ కి ఒక ఐడియా ఉంటది అతడికి తెలియకుండా ఎలాంటివి జరగవు కదా అంటూ తనపై సోషల్ మీడియాలో జరిగిన.. మాటల దాడి విషయంలో అనసూయ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


Share
Advertisements

Related posts

God Father: మెగా ఫ్యాన్స్‌కి, అతనికి మధ్య గొడవ.. అదే కారణమా.. విస్తుగొలిపే నిజాలు ఇవే..!

Ram

చిరు కోసం మ‌రో రీమేక్‌పై క‌న్నేసిన రామ్ చ‌ర‌ణ్‌.. మ‌ళ్లీ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్టే!

kavya N

Sridevi Drama Company :  వార్నీ.. యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కూడా కామెడీ కింగ్ అయ్యాడుగా?

Varun G