NewsOrbit
Entertainment News సినిమా

Anasuya: ఆంటీ అనే పదం పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ..!!

Share

Anasuya: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ ఒకానొక టైం లో ఆంటీ అనే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనని ఆ రకంగా పిలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని… పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా తాను సిద్ధంగా ఉంటున్నట్లు అప్పట్లో అనసూయ వ్యవహరించిన తీరు పెద్ద చర్చకు దారి తీసింది. అయితే తాజాగా ఇప్పుడు ఆంటీ అనే పదం పై గతానికి భిన్నంగా స్పందించింది.

Anchor Anasuya once again made key comments on the word aunty

సోషల్ మీడియాలో నేటిజన్లతో చిట్ చాట్ చేసిన సమయంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆంటీ అంటే ఎందుకు కోపం అని అడిగిన దానికి అనేక అంశాలను అనసూయ వెల్లడించింది. “ఆంటీ అని సంబోధించే వాళ్ళ అర్థాలు వేరు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం కోపం రావడం లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. వాటిని పట్టించుకోవడం లేదు. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం కెరియర్ కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలియజేసింది.

Anchor Anasuya once again made key comments on the word aunty

ఈమధ్య అనసూయ సినిమాల్లో టీవీ షోలలో కంటే అనేక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరయ్యి… బిజీబిజీగా గడుపుతుంది. యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ అతి తక్కువ కాలంలోనే తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకోంది. “జబర్దస్త్” షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకోవటంతో పాటు ఐటెం సాంగ్స్ కూడా చేయడం జరిగింది. అనసూయ నటించిన రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు అతిపెద్ద హిట్ అయ్యాయి. వీటి కంటే ముందు క్షణం సినిమాతో నటిగా అనసూయకి మంచి గుర్తింపు లభించింది. దాదాపు 35 సంవత్సరాల వయసుకు పై బడిన అనసూయ…గ్లామర్ విషయంలో కుర్ర యాంకర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో మంచి పోటీ ఇస్తూ ఉంటది. సోషల్ మీడియాలో తిరుగులేని పాపులారిటీ ఉన్న అనసూయ వివాదాలలో కూడా ఆ రకంగానే చిక్కుకుంటూ ఉంటది. ఆమెపై వచ్చిన చాలా వివాదాలలో ఆంటీ అనే పదం వివాదం ఆమెకు పెద్ద తలనొప్పి అయ్యింది. ఈ క్రమంలో లేటెస్ట్ గా అటువంటి పదాలు పట్టించుకోవటం లేదని అనసూయ తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయటం సంచాలనంగా మారింది.


Share

Related posts

ఆ హీరోయిన్ తో సిద్ధార్థ్ ప్రేమాయ‌ణం.. త్వ‌ర‌లో మోగ‌నున్న‌ పెళ్లి బాజాలు?!

kavya N

Bigg boss 4 Winner Abijeet : బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి?

Varun G

“విశాల్ కి నేనంటే పిచ్చి.. నాకోసం పడి ఛస్తాడు.. పెళ్లి చేసుకోమని చంపుతున్నాడు” సీక్రెట్ వదిలిన టాప్ హీరోయిన్

Varun G