Anchor Anasuya: 37 సంవత్సరాల వయసులో కూడా టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో తిరుగులేని క్రేజ్ తో అనసూయ(Anasuya) దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ.. మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Show) ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినిమా రంగంలో సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) నటించిన “రంగస్థలం” తో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకోవడం జరిగింది.
ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే సమయంలో ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప”(Pushpa) లో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించి తన నటనలో ఉన్న మరో కోణాన్ని వెండి తెరపై అద్భుతంగా పండించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి అనసూయ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే డైరెక్టర్ క్రిష్.. దర్శకత్వంలో గురజాడ అప్పారావు “కన్యాశుల్కం”(Kanya Shulkam) నాటకాన్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఈ వెబ్ సిరీస్ లో… ఫస్ట్ టైం అనసూయ వేశ్య పాత్ర చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇదే “కన్యాశుల్కం” నాటకం ఆధారంగా గతంలో “కన్యాశుల్కం” సినిమా చేయడం జరిగింది. ఆ టైంలో “గిరీశం” పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. వేశ్య క్యారెక్టర్ “మధురవాణి” పాత్రలో మహానటి సావిత్రి నటించింది. అయితే ఇప్పుడు “కన్యాశుల్కం” వెబ్ సిరీస్ లో మధురవాణి అనే వేశ్య పాత్ర అప్పట్లో మహానటి సావిత్రి చేసిన పాత్రలో.. అనసూయ నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…