బిగ్ బాస్ నాలుగవ సీజన్ ప్రేక్షకులను మెల్ల మెల్లగా అలరిస్తుంది. షో పై ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో నిర్వాహకులు ఇంటిలోకి వైల్డ్ కార్డ్ రూపంలో కొత్త కొత్త ముక్కలను ఎంట్రీ ఇవ్వడంతో పాటు బిగ్ బాస్ సరికొత్త టాస్కులతో అలరిస్తున్నాడు. ఇదిలాఉండగా “ఊకు హృదయం” టాస్క్ లో అభిజిత్ ఆడిన గేమ్ పట్ల స్టార్ యాంకర్ రవి సంచలన కామెంట్ చేశారు. ఇద్దరూ బంధువులు కావడంతో ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి అభిజిత్ గురించి మాట్లాడుతూ… “నేను బిగ్‌బాస్ ప్రోమోలు చూస్తున్నాను.
గేమ్‌లో పరిస్థితిని అంచనా వేసి అప్పటికప్పుడు అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ చేయడం సూపర్బ్. పైగా అందరూ అతడిపై అరుస్తున్నా బ్యాలెన్స్ ఇన్గి మైండ్ కలిగి ఉన్నాడు. అది చూసి నేనేమీ షాక్ అవలేదు. ఎందుకంటే అతడిలో నాకు ఎమ్ఎస్ ధోనీ కనిపిస్తున్నాడు. అభి.. ఏదైనా గొడవ జరిగితే తిరిగి అరవడం బదులు కూర్చుని మాట్లాడుకుందాం అనే టైపు. అతడు రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటాడు. చాలా సైలెంట్. అవసరమైతేనే మాట్లాడతాడు.
ఓ ఫంక్షన్లో మేము మాస్ డ్యాన్స్ చేస్తున్నాం. అక్కడే ఉన్న అభిని డ్యాన్స్ చేయమని పిలిచాం. కానీ అతను సాల్సా వంటి పాటలకైతేనే స్టెప్పులేస్తానన్నాడు. కానీ అభి ఒక్కసారి నమ్మాడంటే అది ఏదైనా సరే విడిచిపెట్టడు. అతడు తప్పకుండా టాప్ 3లో ఉంటాడు. కానీ రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే మొదట నేనే అతడిని విమర్శిస్తా” అని చెప్పుకొచ్చాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?