Anchor Ravi Wife Nithya: గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లి తెర పై తనదైన మాట తీరుతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవి చేసే మాస్ యాంకరింగ్ ద్వారా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. అదేవిధంగా రవిపై ఎఫైర్స్ కూడా అప్పట్లో ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఒక కార్యక్రమంలో రవి తన భార్య నిత్య సక్సేనాతో పాటు తన కూతురిని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ విధంగా రవి తన భార్యను పరిచయం చేసే వరకు తనకు పెళ్లి అయిందనే విషయం చాలా మందికి తెలియదు.
ఈ క్రమంలోనే రవి చేసే ప్రతి ఈవెంట్ కి కూడా అప్పటి నుంచి తన భార్యను తీసుకురావడం మొదలు పెట్టాడు.తాజాగా సుమ, రవి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా ఎపిసోడ్ కు రవి భార్య కూడా వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా రవి తన భార్య గురించి ఎన్నో విషయాలను తెలియ జేశాడు. అదే విధంగా నిత్య రవి గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ ఈ కార్యక్రమం ద్వారా బయట పెట్టింది.
తెల్లవారుజామున 3 గంటలకు:
సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన రవి దంపతులను సుమ బాగానే ఆడుకుంది. ముఖ్యంగా సుమ రవి రాత్రి ఎన్నింటికి వస్తాడని అడగగా అందుకు నిత్య తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడని చెప్పింది. మరి మీరేం అనరా అని సుమ అడగగా.. షూటింగ్ లేట్ అని సమాధానం చెబుతారు అంటూ నిత్య చెప్పుకొచ్చింది. రవి ఫోన్ లో నీ పేరు ఏమని ఫీడ్ చేసుకున్నారని సుమ అడగగా అందుకు నిత్య ఏమో తెలియదు.. అసలు రవి ఫోన్ పాస్ వర్డ్ కూడా నాకు తెలియదు అంటూ నిత్య షాకింగ్ ఆన్సర్ చెప్పింది. అసలు రవి ఫోన్ చూసే సాహసం కూడా తను చెయ్యని ఈ కార్యక్రమం ద్వారా రవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నిత్య బయటపెట్టారు. ఇకపోతే రవి ప్రస్తుతం స్టార్ మా,జీ టీవీలలో పలు కార్యక్రమాలు చేస్తూ ఎంతో సందడి చేస్తున్నారు
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!