ఇటీవల సమాజంలో చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సొంత బంధువులు కూడా వావివరసలు లేకుండా చిన్న పిల్లల అని చూడకుండా క్రూర మృగాలు గా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఉన్నాయి. బంధువులు అని తల్లిదండ్రులు వారి పిల్లలను ముద్దాడేందుకు పంపిస్తుంటే కొన్నిచోట్ల దారుణమైన సంఘటనలు జరుగుతున్న తరుణంలో వాటిపై అవగాహన కల్పించడానికి చిన్మయి ఎప్పటినుండో పోరాటం చేస్తూ ఉంది.
ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుంది. ఏది అత్యాచారం..? ఏది అసభ్య ప్రవర్తన..? ఏది మంచి ప్రవర్తన..? అనేది చిన్నతనం నుంచి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించాలని చిన్మయి శ్రీపాద పోస్ట్ పెట్టింది. తాజాగా ఇదే విషయంపై యాంకర్ రేష్మి స్పందించింది. చిన్నపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని తల్లిదండ్రులు కట్టిపడేసే రీతులో వ్యవహరించ కూడదని చెప్పుకొచ్చింది.
వాళ్ల దగ్గరికి వెళ్ళండి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి ముద్దు పెట్టుకోండి ఇలాంటివి తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలకే ఆ స్వేచ్ఛ ఇవ్వాలని…. అంతకంటే ముందు అవగాహన కలిగించాలని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా చిన్మయి చేసినా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, తల్లిదండ్రులు పిల్లలకి అవగాహన కలిగించే రీతిలో ఉండాలని పెట్టిన పోస్ట్ కి రష్మి వందకి 100% కరెక్ట్ కానీ తన భావాలు ఆలోచనలు కూడా అదే అంటూ రేష్మి చెప్పుకొచ్చింది.