Entertainment News ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ సీజన్ 6లో బంపర్ ఆఫర్ అందుకున్న యాంకర్ శివ..??

Share

బిగ్ బాస్ సీజన్ 6 యాంకర్ శివ అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్ లో తనకంటూ సెపరేట్ ఛానల్ స్టార్ట్ చేసి చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వైరల్ అయ్యారు. రాకేష్ మాస్టర్, కత్తర్ పాప, అగ్గిపెట్టి మచ్చ.. ఇంకా సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడే పాపులర్ వాళ్లని ఇంటర్వ్యూ చేస్తూ ఒకపక్క ఫన్ క్రియేట్ చేస్తూ మరోపక్క తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ యాంకర్ శివ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో బిగ్ బాస్ ఓటిటిలో కూడా అడుగు పెట్టడం జరిగింది.

Anchor Siva who received a bumper offer in Bigg Boss season 6..

బిగ్ బాస్ ఓటిటిలో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ సీనియర్స్ కి మంచి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ కి యాంకర్ శివ హౌస్ లో షాకులు మీద షాకులు ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ ఓటిటిలో అద్భుతంగా రాణించిన ట్రోఫీ గెలవలేకపోయాడు. ఇదంతా పక్కన పెడితే త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో బిగ్‏బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివనీ షో నిర్వాహకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు చేయటంలో యాంకర్ శివ దిట్ట కావటంతో… ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

Anchor Siva who received a bumper offer in Bigg Boss season 6..

బిగ్‏బాస్ బజ్ హోస్ట్ గా.. సీజన్ 3లో తానిష్, సీజన్ ఫోర్ లో.. రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 5లో… అరియనా చేయడం జరిగింది. అయితే ఈసారి సీజన్ సిక్స్ కి సంబంధించి బిగ్‏బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ .. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇందుకుగాను భారీ రెమ్యూనరేషన్ షోనిర్వాహకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Acharya: మెగా మల్టీస్టారర్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎక్కడంటే..

GRK

Aacharya : ఆచార్య లో పూజా హెగ్డే.. నిముషాలకే కోట్లు డిమాండ్ చేసిందా ..?

GRK

Bigg Boss Telugu 5: నటరాజ్ మాస్టర్ కి.. బాలయ్య బాబు బిగ్ ఆఫర్..??

sekhar