యాంకర్ సుమ అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లలని నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సుమను ఇష్టపడుతారు. తన వాక్చాతుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. మంచి పేరుతో పాటు ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. అందరూ అక్క అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె తన ఫ్యాన్స్‌తో కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో సుమకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టార్ హీరోయిన్ లకు కూడా లేని గుర్తింపు ఈమె సొంతం. నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టి.. శ్రీమతిగా మారి.. ప్రస్తుతం యాంకర్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయస్సులో నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఏ కార్యక్రమం చేసిన అందరూ టీవీల ముందు అతుక్క పోవాల్సిందే. అలాంటి సుమ 1000 అడగటం ఏంటి అనుకుంటున్నారా??
సుమక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి తనదైన శైలిలో వీడియోలు, ఇంటర్వ్యూ లు చేస్తుంది. దాని కింద కొంతమంది అభిమానులు ఆసక్తికర కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఇటీవల ఒక అభిమాని సుమను ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు.
చూడండి సుమ గారూ.. మీరు నాకు రిప్లై ఇవ్వరు.. పందెం 1000 రూపాయలు అంటూ పోస్ట్ చేసాడు. దానికి వెంటనే సుమ ఇదిగో నా అకౌంట్ నెంబర్.. 1000 వేయి అంటూ రిప్లై ఇచ్చింది. సుమ అభిమానులతో ఎంత సరదాగా ఉంటుందో దీన్నిబట్టి అర్థం అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. సమయం దొరికితే చాలు అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. వాళ్లతో కలిసి కామెడీ చేస్తుంది. ఇలా తన మాటలతో ఇంట్లో మనిషిలా అందరితో కలిసిపోతుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!