సినిమా

Anchor Suma: పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్న సుమ‌.. వీడియో వైర‌ల్‌!

Share

Anchor Suma: ప్ర‌ముక యాంక‌ర్ సుమ పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకుంది. అయితే ప్ర‌మాదం జ‌రిగింది ఇప్పుడు కాదు. అస‌లేం జ‌రిగింది..? ప్ర‌మాదం ఎప్పుడైంది..? వంటి విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల నుంచీ నెం.1 యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ఇటీవ‌ల న‌టిగా మారిన సంగ‌తి తెలిసిందే.

సుమ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ`. విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బలగ ప్రకాష్ ఈ మూవీని నిర్మించ‌గా.. ఎం.ఎం. కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

మే 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక పరిపూర్ణ గ్రామీన సినిమా. ఇందులో సుమ త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో మంచి మార్కులు వేయించుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే సుమ‌కు ఓ ప్ర‌మాదం జ‌రిగింది. షూటింగ్‌ నిమిత్తం ఆమె ఓ అడవిలో ఉన్న చిన్న నీటి ప్రవాహం వద్ద నిలబడింది.

అక్కడ ఉన్న రాళ్లు పీచు పట్టి ఉండడంతో సుమ కాలు జారి కిందపడింది. అయితే ఈ ప్ర‌మాదంతో త‌న‌ను తాను కంట్రోల్ చేసుకుని ఎటువంటి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా ర‌క్షించుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సుమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. `జయమ్మ పంచాయితీ షూటింగ్ టైమ్‌లో తృటిలో తప్పించుకున్నాను` అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు `జాగ్ర‌త్త సుమ‌క్క‌, మీకేమైనా అయితే మేము త‌ట్టుకోలేం` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CdOM1XgJwZI/?utm_source=ig_web_copy_link


Share

Related posts

మెగా హీరోతో నందిని రెడ్డి సినిమా

Siva Prasad

Mahesh Babu: ఆ సినిమాని మహేష్ చేత బాలీవుడ్ లో చేయించాలని కృష్ణ ప్లాన్ చేశారట..??

sekhar

Bigg boss 4: ఇదే ఇక ఫైనల్ లిస్టు.. అఖిల్ క్లాస్ మేట్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి..!

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar