Anchor Suma: బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా దూసుకుపోతున్న స్టార్ యాంకర్ సుమ.. ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ`. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బలగ ప్రకాష్ రావు నిర్మిస్తుండగా.. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సుమ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఈవెంట్లకు, టీవీ షోలకు రూ. 3 నుంచి 5 లక్షల వరకు తీసుకనే సుమ.. `జయమ్మ పంచాయితీ` సినిమాకుగానూ ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందట.
ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడట్లేదట. ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన సుమ.. ఆ తర్వాత అరడజన్‌కి పైగా సినిమాల్లో నటించింది.
కానీ, పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. కొత్తవారు ఎంత మంది వచ్చినా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరూ అంటే.. టక్కున అందరూ సుమ పేరే చెబుతారు. అంతలా ఆమె క్రేజ్‌ను సంపాదించుకుంది.