డబ్బు కోసం అలాంటి పనులు చేయాలా? బిగ్ బాస్‌పై విష్ణుప్రియ సంచలన కామెంట్స్

బిగ్ బాస్ రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌నుకుంటా.! ఎందుకంటే ఈ ఒక్క షోతో త‌మ టీవీ ఛానెల్ రెటింగ్స్ అమాంతం ఆకాశాన్ని తాకెస్తాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ చాలా భాష‌ల్లో బిగ్ బాస్ షో కు మంచి ఆద‌ర‌ణ ఉంది. అందుకే నాలుగైదు సీజ‌న్లు జ‌రుపుకుంటూ రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ షో. ఇంత క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్‌పై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా తీవ్ర స్థాయిలో వ‌స్తుంటాయి.

అలా విమ‌ర్శ‌లు గుప్పించే వారిలో సినీ ప్ర‌ముఖులు, విశ్లేష‌కులు, కంటెస్టెంట్ల‌తో పాటు సామాన్య ప్ర‌జానీకం కూడా ఉంటారు. బిగ్ బాస్ షో లో రియాలిటీ లేద‌నీ, ఇది ముందుగానే రాసుకున్న స్క్రిప్టెడ్ షో అనీ, రేటింగ్స్ కోసం యాజ‌మాన్యం దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఘాటు వ్యాఖ్య‌లే చేశారు ఇటీవ‌ల ప‌లువురు బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టంట్లు. ఈ నేప‌థ్యంలోనే బుల్లితెర ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టి అయిన విష్ణు ప్ర‌యా సైతం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇది వ‌ర‌కూ ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లో త‌ళుక్కున మెరిసిన విష్ణుప్రియా.. బుల్లితెర యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఈ మ‌ధ్య ఆమె పాల్గొంటున్న పోవే పోరా షోకు బ్రేక్ ప‌డ‌టంతో సినిమాల్లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది ఈ అమ్మడు. ఆమె న‌టించిన చెక్‌మేట్ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల అయింది. ఈ నేప‌థ్యంలోనే ఓ యూట్యూబ్‌కు చానెల్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల ప్రారంభ‌మైన తెలుగు బిగ్‌బాస్ 4 సీజ‌న్‌లో విష్ణు ప్రియ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి క‌దా అనే ప్ర‌శ్న‌కు ఆమె స్పందిస్తూ.. బిగ్ బాస్ షో త‌న‌కు అస్స‌లు న‌చ్చ‌ద‌నీ, డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి అలాంటి షో చేయ‌నంటూ సంచ‌ల‌న కామెంట్ చేశారు. కేవ‌లం డ‌బ్బ‌లు కోమ‌సే కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డం వంటి ప‌నులు చేయ‌డం త‌న వ‌ల్ల కాద‌నీ, లైఫ్ లో ఎప్ప‌టికీ అలాంటి ప‌నులు చేయ‌న‌ని చెప్పారు. వీలైతే అంద‌రిని ప్రేమించాలి కానీ ఎవ‌రినీ ద్వేశించ‌కూడ‌ద‌ని చెప్పింది ఈ భామ‌.