NBK 108: ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమైంది. చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో సినిమాలు కంప్లీట్ చేసే దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. దీంతో బాలకృష్ణ సినిమాని కూడా ఆ రీతిగానే కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈరోజు ఉగాది పండుగ నేపథ్యంలో “NBK 108” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య మాస్ లుక్ లో కనువిందు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలా పవర్ ఫుల్ గా బాలయ్య కనిపిస్తున్నారు. “NBK 108” ఉగాది ట్రీట్ ఫస్ట్ లుక్ పోస్టార్ విషయంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఇటీవల మూవీ సెట్ లో అడుగు పెట్టడం జరిగింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఏకధాటిగా షూటింగ్ చేసి దసరా పండుగకు విడుదల చేయడానికి… మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. “అఖండ” సినిమా రాకముందు వరుస పరాజయాలతో కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాలయ్య.. “అఖండ” తో పుంజుకోవటం జరిగింది. అనంతరం “అన్ స్టాపబుల్” అనే టాకీషో ద్వారా మరింత క్రేజ్ సంపాదించారు. ఇతర హీరోల అభిమానులకు కూడా ఈషో ద్వారా బాగా నచ్చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి తో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్య ఏ మేరకు హిట్ అందుకుంటారో చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!