Balakrishna: వరుస ఫ్లాపులలో ఉన్న బాలకృష్ణ గత ఏడాది “అఖండ”తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో రికార్డు స్థాయి కలెక్షన్ లు రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా కళ్లుచెదిరే కలెక్షన్ సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి బోయపాటి టేకింగ్, బాలయ్య యాక్టింగ్.. థియేటర్ లో “అఖండ” చూస్తున్న ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. సినిమా విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య బాబు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ప్రాజెక్టులను ఓకే చేయటం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్యనీ ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవల కంప్లీట్ అయినట్లు అనిల్ రావిపూడి చెప్పటం జరిగింది. బాలయ్య నీ నందమూరి ఫ్యాన్స్ ఏ రీతిగా చూడాలని అనుకుంటున్నారో… అదేవిధంగా చూపించనున్నట్లు తన మార్క్ కామెడీ కూడా ఉండనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి “అన్నగారు” అనే టైటిల్ పెట్టడానికి అనిల్ రావిపూడి డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో నందమూరి ఫాన్స్.. తిరుగులేని టైటిల్ అని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా టైటిల్ కి తగ్గ హిట్ పడితే నందమూరి ఫ్యాన్స్ కాలర్ లో మరోసారి ఎగరేయడం గ్యారెంటీ అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. నందమూరి బ్రాండ్ తెలుగు వారి గుండెల్లో పడటంలో పితామహుడు స్వర్గీయ తారక రామారావు ని అందరూ అభిమానంతో అన్నగారు అని అప్పట్లో పిలవడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఆ టైటిల్ తో బాలకృష్ణ సినిమా రావడం అంటే.. ఖచ్చితంగా సినిమాకి మరో గ్లామర్ అదనంగా వచ్చినట్లే అని ఈ వార్తపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలోనే అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు.. టైటిల్ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ప్రకటించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.