NewsOrbit
Entertainment News సినిమా

NBK 108: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య చేయబోయే క్యారెక్టర్..??

Share

NBK 108: నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట తారక ఎక్కుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవల బాలయ్య బాబు బర్త్ డే నాడు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచేయడం జరిగింది. కాగా ఈ సినిమా అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Anil Ravipudi is the character that Balayya is going to play in the film

అయితే బాలయ్య బాబు సినిమాకి సంబంధించి గతంలో అనిల్ రావిపూడి ఇప్పటివరకు.. బాలయ్య బాబు కెరీర్ లో చేయని పాత్ర తన సినిమాలో చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య చేసే క్యారెక్టర్ కి సంబంధించి రకరకాల డిస్కషన్స్ బయట జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక ట్రైబల్ ఏరియాకి.. నాయకుడిగా బాలయ్యబాబు..కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతమాత్రమే కాదు సినిమాలో విలన్ పాత్రలో హీరో రాజశేఖర్ నీ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

బాలయ్య బాబు కూతురుగా శ్రీలీల నటిస్తోందని, ప్రియమణి కూడా కీలక పాత్ర చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు “NBK 107” కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా రాబోయే దసరాకి విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్య బాబు చేయబోయే సినిమా వచ్చే సమ్మర్ కి విడుదల కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యే మధ్యలో చిన్న గ్యాప్ లో ఆహాలో “అన్ స్టాప్పబుల్” సెకండ్ సీజన్ బాలయ్య బాబు స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఆహా యాజమాన్యం అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది.


Share

Related posts

Krishna Mukunda Murari: మురారి మీద కోపం తో కృష్ణ తొందరపాటు నిర్ణయం… తన ప్రేమ ని తానే దూరం చేసుకొనుందా…

siddhu

ప‌రిశీల‌న‌లో మ‌రో టైటిల్‌

Siva Prasad

SP Balasubramanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో ఎవరూ మర్చిపోలేనివి ఆ రెండే

GRK