Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. `పటాస్` మూవీతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి.
దీంతో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా ముద్ర వేయించుకున్న అనిల్ రావిపూడి.. తాజాగా `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించాడు. `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించారు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. భారీ అంచనాల నడుమ మే 27న రిలీజ్ అయిన ఈ మూవీ.. సూపర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నయా కలెక్షన్స్ రాబడుతోంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా.. ఆ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. `థంబ్ నేల్స్ పెట్టుకోండి, నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది .. మరో ఫ్యామిలీ ఇక్కడున్న ఈ టీమ్. మూడో ఫ్యామిలీ ఆడియెన్స్.` అని అనిల్ తన మనసులో మాటను ఓపెన్‌గా చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ.. `ఎఫ్ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి వసూళ్లతో పాటు ప్రశంసలు పెరుగుతున్నాయి. ఈ వారమంతా కూడా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కరోనా తరువాత వచ్చిన అఖండ, పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ఆ సినిమాల సరసన ఎఫ్ 3 నిలవడం సంతోషంగా ఉంది` అంటూ ఆయన పేర్కొన్నారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…