Balakrishna-Raviteja: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. “ఆర్ఆర్ఆర్” రాక ముందు నుండే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మల్టీస్టారర్ సినిమాలు రావడం తెలిసిందే. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా విడుదలయి రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూ ఉండటం తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండటం తో… బడా స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలయ్య బాబు… మాస్ మహారాజా రవితేజతో ఇద్దరితో కలిపి సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ లేని తిరుగులేని డైరెక్టర్ ఒకరు స్క్రిప్టు రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ లేని డైరెక్టర్ లలో ఒకరు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం “ఎఫ్ త్రీ” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్..మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. గతంలోనే “ఎఫ్ 2” వీరిద్దరి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి.. చేయడం జరిగింది. ఈ క్రమంలో లో రవితేజ- బాలయ్య బాబు తో కలిసి మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని.. అనిల్ రావిపూడి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో బాలయ్య బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలయ్య బాబుతో చేయబోయే సినిమాలో రవితేజకి కూడా క్యారెక్టర్ సెట్ చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
రవితేజ ఇప్పటికే చిరంజీవితో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో బాలకృష్ణతో కూడా చేయటానికి రెడీ అవటం.. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా రానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉండగా అప్పట్లో బాలకృష్ణ ఆహా ఓటిటి లో …అన్ స్తప్పబుల్ షోలో రవి తేజ ని ఇంటర్వ్యూ చేయడం తెలిసిందే. ఆ టైంలో ఇద్దరు హీరోలు మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇద్దరికిద్దరూ రెడ్ బుల్ ఎనర్జీ తరహాలో.. షోలో చెలరేగిపోయారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు వార్తలు రావడంతో.. ప్రాజెక్టు ఓకే అయితే.. మరో ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ అని ఇద్దరు హీరోల అభిమానులు అంటున్నారు.