Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని డైరెక్టర్గా దూసుకుపోతున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. అరడజన్ పైగా చిత్రాలకు రచయితగా పని చేసిన ఈయన.. `పలాస్`తో డైరెక్టర్గా కెరీర్ను ఆరంభించారు. ఆ తర్వాత వరుస విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.
ఈయన సక్సెస్ రేటును చూసి స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. సోనాలి చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, ఆలీ కీలక పాత్రలను పోషించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారీ అంచనాల నడుము నేడు వరల్డ్ వైడ్గా విడుదలైన ఈ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. కథేమి పెద్దగా లేకపోయినా.. డబ్బు, దాని వల్ల వచ్చే ఫ్రస్టేషన్, ఫన్ బాగా ఆకట్టుకుంటాయి. భారీ కథను ఆశించకుండా, లాజిక్లను వెతక్కుండా చూస్తే ఎఫ్ 3 ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రమోషన్స్ వేరె లెవల్లో చేశారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకున్న ఓ కోరికను బయట పెట్టారు.
ఆయన మాట్లాడుతూ.. `సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గార్లతో సినిమాలు చేయాలని నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అనుకున్నాను. వెంకటేశ్ గారితో రెండు సినిమాలు చేసేశాను. త్వరలో బాలకృష్ణగారితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాను. ఇక మిగిలింది చిరంజీవి .. నాగార్జున. వాళ్లతో కూడా తప్పకుండా సినిమాలు చేస్తాను. ఆ అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను .. రావాలనే కోరుకుంటున్నాను` అంటూ చెప్పుకొచ్చారు. మరి అనిల్ రావిపూడి భారీ కోరిక నెరవేరుతుందో..లేదో..చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!