హీరోయిన్స్ పెళ్లి విషయంలో ప్రేక్షకులకు ఎందుకో తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. పెళ్లి గురించి ఎవరు ఎలా? స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి గురించి ఎవరైనా ప్రశ్న వేస్తే చాలు.. దాట వేసే సమాధానాన్ని చెబుతారు. కానీ తాను అలా కాదని అంటుంది హీరోయిన్ అంజలి. పెళ్లికి, వయసుకి ముడి పెట్టకూడదని అంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సింగిల్‌గానే ఉందట. “నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే ప్రపంచానికి చెబుతా!. ప్రతి ఒక్కరూ వివాహ బంధంలో అడుగు పెట్టాల్సిందే. తప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే రైట్ పర్సన్ దొరకాలి. కానీ నేను ప్రస్తుతం నా వర్క్‌తో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి“ అంటుంది అంజలి.
previous post
next post