సినిమా

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

Share

 

బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్ జోహార్ ఉద్యమించాడు. అందుకే అతడిపై అప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. అయితే ఎలాంటి విమర్శలు ఎదురైనా తనలో ఎటువంటి మార్పు ఉండదనేలా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా బిజీ అయిన కరణ్ బాలీవుడ్ సెలబ్రిటీల కూతుర్లు, కొడుకులను నెత్తిన పెట్టుకున్నాడు. వారిని తన సినిమాల్లో నటింపజేస్తూ బయట వారికి కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు.

నెపోటిజాన్ని ఎందుకలా పెంచుతున్నాడు?

కరణ్ పలువురు హీరో హీరోయిన్ల కూతుర్లు, కొడుకులను, తమ్ముళ్లను సినిమా ఇండస్ట్రీ తెచ్చే పనిలో పడ్డాడు. నిజానికి కరణ్ ఏం చేసినా, ఎలా చేసినా దాని వెనుక ఒక వ్యాపారం ఉంటుంది. అయితే స్టార్స్ పిల్లలతో మాత్రమే వ్యాపారం లాభసాటిగా ఉన్నట్టుంది. అందుకే వారిని తన నెత్తిన పెట్టుకున్నాడు. ఇలా చేస్తున్న కరణ్ ను బందు ప్రీతికి ప్రతినిధిగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా విమర్శిస్తూ ఉంటారు.

నెక్స్ట్ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరో కూతురే హీరోయిన్

కరణ్ తన నిర్మాణంలో తీసే నెక్స్ట్ రెండు సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను హీరోయిన్‌గా బుక్ చేసుకున్నాడట. బాలీవుడ్ సినీ వారసుల పిల్లలకు ఆఫర్లు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సారా అంటే కరణ్ కు అసలు నచ్చదనే ప్రాచారం ఉంది. కానీ కరణ్ నెక్స్ట్ రెండు సినిమాల్లో సారాకే అవకాశం ఇవ్వడం ద్వారా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. కరణ్ జోహార్‌లోని ఈ గుణం ఇప్పుడు చాలా విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి? బయట వారికి అసలు ఛాన్సులే ఇవ్వరా? బాలీవుడ్ వారసుల పిల్లలందరినీ ఇండస్ట్రీలోకి తీసుకు వస్తే? ఇక బయట వారు నటించడానికి ఒక్క ఛాన్స్ ఇచ్చిన మిగులుతుందా? టాలెంటెడ్ నటులు ఏమైపోవాలి అని చాలామంది అతని తిట్టిపోస్తున్నారు.


Share

Related posts

Catherine Tresa: కేథరీన్ హీరోయిన్ అని చెప్పుకోవడం దండగ..ఏదో ఫ్లోలో అవకాశాలు అందుకుంది..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడానికి కారణాలు ఇవేనా..?

GRK

Kalpika Ganesh Cute Pictures

Gallery Desk

మరో కొత్త గెటప్‌లో..

Siva Prasad