Prabhas: “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు చాలా టైం తీసుకుంటున్నాయి. కానీ ఫలితాలు చూస్తే మొదటి షో కి అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. దీంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం చెందుతున్నారు. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన “సాహో” షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు పాటు జరిగింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత “రాదేశ్యం” నటించగా ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులపై భారీ ఒత్తిడి నెలకొంది. కచ్చితంగా ఒక భారీ హిట్టు పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో జనవరి 12వ తారీకు బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్” విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. అనంతరం సినిమాకి సంబంధించి గ్లింప్స్ వీడియో విడుదల చేయడం జరిగింది. వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్.. చాలా ఎటకారంగా చీప్ క్వాలిటీ తరహాలో ఉండటంతో అభిమానుల నుండి విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో జనవరి 12వ తారీకున విడుదల చేస్తామని చెప్పిన “ఆదిపురుష్” నీ జూన్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఈ పరిణామంతో కేజిఎఫ్ దర్శకుడు ప్రభాస్ తో చేస్తున్న “సలార్” కూడా వాయిదా పడనున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. “సలార్” వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. కానీ ఇప్పుడు “ఆదిపురుష్” జూన్ నెలలో వస్తూ ఉండటంతో మూడు నెలల గ్యాప్ లో ఒకేసారి ప్రభాస్ నుంచి రెండు సినిమాలు వస్తే కలెక్షన్లపై ఎఫెక్ట్స్ ఉండొచ్చని “సలార్” మేకర్స్ డిసైడ్ అయినట్లు…”సలార్” రిలీజ్ డేట్ మార్చనున్నట్లు సరికొత్త టాక్ వినిపిస్తుంది.