NewsOrbit
Entertainment News సినిమా

Ram Charantej: మరో బ్యానర్ స్టార్ట్ చేయబోతున్న చరణ్..ఫస్ట్ సినిమా ఎవరితో అంటే?

Share

Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆల్ రెడీ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదల నిర్మాణ ప్రొడక్షన్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సినిమాలు నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి నిర్మాణ బాధ్యతలు చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బ్యానర్ ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యారు. విషయంలోకి వెళ్తే యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థకి చెందిన విక్రంతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ “V మెగా పిక్చర్స్” ను తీసుకొస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

Another banner started by Mega Power Star Ram Charan Tej

కొత్త టాలెంట్ నీ ప్రోత్సహించే ఉద్దేశంతో దీనిని స్థాపించినట్లు సమాచారం. అయితే ఈ బ్యానర్ లో మొట్టమొదటిగా అక్కినేని అఖిల్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. అఖిల్ ఇటీవల “ఏజెంట్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా ఏమీ లేవు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కొత్త బ్యానర్ లో అఖిల్ చేయబోయే సినిమా దర్శకుడు… కొత్త డైరెక్టర్ అని సమాచారం.

Another banner started by Mega Power Star Ram Charan Tej

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్… శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పాన్ వరల్డ్ వైడ్ సినిమా చేయబోతున్నారు. “RRR” సినిమాతో చరణ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. దీంతో బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధికమైన భాషల్లో.. క్రీడా నేపథ్యంలో తీయబోయే సినిమా అన్ని సమాచారం. ఈ రకంగా ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా రామ్ చరణ్ బిజీ అవుతూ ఉన్నారు.


Share

Related posts

‘సింగిల్ స్క్రీన్ ధియేటర్లు..’ ప్రేక్షకులకు ఇక జ్ఞాపకాలేనా..?

Muraliak

ఏమీ లేకుండా రికార్డ్ క్రియోట్ చేసిన అక్షయ్ కుమార్ “లక్ష్మీ బాంబ్”.. కారణం చాలా అంటే చాలా చిన్నది..!

GRK

NTR: ఎన్టీఆర్ కంటే ముందే స్టోరీ తెలుసుకున్న సుకుమార్..??

sekhar