Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి ఆది నుండి అనేక అడ్డంకులు కలుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సినిమాకి పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాక మహేష్ తల్లి తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో కొన్ని నెలలపాటు సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో.. జనవరి నుండి షూటింగ్ రెగ్యులర్గా జరుగుతున్న క్రమంలో అప్పటిదాకా హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే అన్ని వారాల కారణాలవల్ల సినిమా షూటింగ్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత మరి కొంతమంది టెక్నీషియన్స్ కూడా తప్పుకోవడం జరిగింది.
ఇలా ఉంటే ఇప్పుడు మరో మార్పు గుంటూరు కారం సినిమా విషయంలో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించి ఐటెం సాంగ్ ప్లేస్ లో నేషనల్ వైడ్ ఇమేజ్ కలిగిన రష్మిక మందన్నా ఫిక్స్ చేసుకున్నారట త్రివిక్రమ్ . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా బాలీవుడ్ బ్యూటీపై సినిమా మేకర్స్ మోజు పడటం జరిగిందట. అందుకే హాట్ బ్యూటీ నూరాఫతేహి ని.. ఈ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్ . అంతేకాదు ఆమె కూడా మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
దీంతో రష్మిక ని తీసేస్తూ ఆమె ప్లేస్ లోకి బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దించుతున్నాడు త్రివిక్రమ్. ఈ రకంగా ఐటెం సాంగ్ విషయంలో కూడా గుంటూరు కారం లో హీరోయిన్ నీ సినిమా మేకర్స్ మార్పు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి రాబోతున్న ఈ మూడు సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.