Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలలో మరోపక్క సినిమా రంగాలలో కీలకంగా రాణిస్తున్నారు. రెండిటిలో కూడా తనదైన ముద్ర వేసుకొని దూసుకుపోతున్నారు. జనసేన అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు కలకలం రేపటం తెలిసిందే. ఒకపక్క రాజకీయాలు కీలకంగా చేస్తున్న గాని మరోపక్క… సినిమాల పరంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దొంగగా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ వేసవిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సుజిత్, హరీష్ శంకర్ సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. గతంలో “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ తో…”ఉస్తాద్ భగత్ సింగ్” అనే టైటిల్ సినిమా చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ దర్శకుడితో పవన్ సినిమా ఓకే అయినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. పవన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
తెలుగు చలనచిత్ర రంగంలో ఒక పరాజయం లేని దర్శకుడిగా గోపీచంద్ మలినేని… వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. రవితేజతో హ్యాట్రిక్ విజయం సాధించి లేటెస్ట్ గా సంక్రాంతికి నటసింహం నందమూరి బాలయ్య బాబుతో “వీరసింహారెడ్డి”తో విజయం సాధించారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కి ఓ స్టోరీ వినిపించినట్లు బాగా నచ్చడంతో గోపీచంద్ మలినేని తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.